పండగ పూట ఛార్జీల బాదుడు.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
Advertisement
- పండగ స్పెషల్ బస్సుల ఛార్జీల పెంపుపై హరీశ్ రావు విమర్శలు
- సాధారణ బస్సులనే స్పెషల్స్‌గా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు
- స్పెషల్ బస్సులపై 50 శాతం సర్‌ఛార్జి మాత్రమేనంటున్న టీజీఎస్ఆర్టీసీ
Advertisement
బతుకమ్మ, దసరా పండగల వేళ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పండగకు సొంతూళ్లకు వెళ్లేవారి ఉత్సాహాన్ని ఈ ఛార్జీల పెంపు దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సాధారణ సర్వీసులను తగ్గించి, వాటినే పండగ స్పెషల్ బస్సులుగా చూపిస్తూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు సాధారణ టికెట్ ధర రూ. 230 ఉండగా, ఇప్పుడు రూ. 400 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు రూ. 220 ఉన్న టికెట్‌ను రూ. 290కి పైగా పెంచారని తెలిపారు. ఇదేనా మీ ప్రజా పాలన? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అయితే, ఈ ఛార్జీల పెంపు కేవలం పండగ రద్దీ కోసం నడుపుతున్న 7,000 ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ సర్వీసుల్లో ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని తెలిపాయి. పండగ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత బస్సులు ఖాళీగా తిరిగి రావడం వల్ల అయ్యే నిర్వహణ ఖర్చులను భర్తీ చేసేందుకు ఈ 50 శాతం సర్‌ఛార్జి విధిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జీవో ఎంఎస్ నెం. 16) ప్రకారమే ఈ సర్ఛార్జిని వసూలు చేస్తున్నామని, ఇది కొత్త విధానం కాదని టీజీఎస్ఆర్టీసీ చెబుతోంది. అయినప్పటికీ, పండగ వేళ ఛార్జీల పెంపు సరైంది కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంతో ఈ అంశంపై రాజకీయంగా చర్చ మొదలైంది.